*తే.యూ పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో ధర్నా…
A9 న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ అనే పదం ఉద్యమానికి ప్రతీక, చిరస్మరణీయమైనటువంటి పేరును మార్చి ఈశ్వరి బాయి యూనివర్సిటీ గా మార్చలని చూడటం సరైంది కాదని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు తెలంగాణ యునివర్సిటీ పి.డి.ఎస్.యు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1960 నుంచి 2014 వరకు సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పేరును మార్చటం అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతియటమే అన్నారు.ఎంతో మంది త్యాగాలు, త్యాగాల గాయాలు, ఉద్యమ స్పూర్తి కలిగిన తెలంగాణ పేరును అలాగే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల పేర్లు ప్రభుత్వ సంస్ధలకు పెట్టుకోవడం పద్ధతి కాదని విమర్శించారు.
ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రం పేరుతో అనేక యూనివర్సిటీలు దేశంలో ఉన్నాయని, మన రాష్ట్రంలో ఏకైక యూనివర్సిటీ కి *తెలంగాణ* అని పేరు ఉందని దీన్ని కూడా మారిస్తే చరిత్ర కలిగిన రాష్ట్రానికి అవమానకరమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యునివర్సిటీ పేరు మార్చే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు. జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెంటనే దీనిపై స్పందించి పేరు మార్చకుండా కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తే.యూ పి.డి.ఎస్.యూ నాయకులు ప్రిన్స్, హుస్సేన్, సాయి కిరణ్, ఆకాష్, రమ్య, ప్రవీణ, రాజు, లావణ్య, సరిత, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.