హైదరాబాద్: టీవీ సీరియల్స్ చూడొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలకు సూచించారు. నేటి సమాజంలో మంచిని పరిచయం చేయాల్సిన టీవీ సీరియల్స్ నేరాలు ఎలా చేయాలో చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హమాలీ శ్రీను ఆధ్వర్యంలో మల్లాపూర్ డివిజన్‌లో మహిళలకు చీరల పంపీణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కవిత మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ 1,2,3 ఫలితాలను నిలిపి వేయాలి
అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండక్కి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చీరలు కానుకుగా అందజేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోన్నా ఆడబిడ్డలకు ఇస్తానన్న స్కూటీలు అడ్రస్ లేదన్నారు. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టాక సంక్షేమ పథకాలు మాయం అయ్యాయని విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సే బానోతు చంద్రావతి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు..