A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరం లో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్ కి పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయం మంజూరైన గాని ఇప్పటివరకు స్థల సేకరణ పూర్తి చేయలేదని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నవోదయ విద్యాలయం పై రాజకీయం చేస్తూ ఓపెన్ చేయకుండా అడ్డుకుంటున్నారని, గ్రామీణ పేద విద్యార్థులకి అందుబాటులోకి వచ్చే స్కూల్స్ ను అడ్డుకోవటన్ని పి.డి.ఎస్.యూ గా ఖండిస్తున్నామని,
ఎటువంటి తగాదాలు లేని ప్రభుత్వ భూమిని వెంటనే ఎంపిక చేయాలని, ప్రభుత్వ భూమిని ఎంపిక చేసే వరకు రెంటు బిల్డింగ్ లో క్లాసులు ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎంపీ అరవింద్, ఈ విద్యా సంవత్సరమే క్లాసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు దేవిక, సాయి కిరణ్, నిఖిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.