* ఎంపీ నిధులతో ఆర్మూర్ రైల్వే స్టేషన్ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం……
A9 న్యూస్
ఆర్మూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు దుస్థితిని రెండు నెలల క్రితం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి ఎంపీ నిధులతో రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండగా, ఆర్మూర్ వార్డు కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు ఆర్మూర్ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








