*సాగునీరు లేక తల్లడిల్లిన రైతాంగం…

*రైతుల గోసలను పట్టించుకోరా…?

*కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలైపోతున్న రైతులు….

*అవగాహన లేని ఎమ్మెల్యేతో రూరల్ నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారింది- బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి….

*అదనపు ట్యాంకర్ల ద్వారా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వమే నీరు అందించాలి…

*ప్రభుత్వం రైతులని ఆదుకుని రైతులకు భరోసా కల్పించాలి….

*రోడ్లపై రాస్తారోక నిర్వహించడానికి వెనుకాడం…

A9 న్యూస్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పంటలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని ఎండిన పంటలను చూసి చలించి పోయారు. నష్ట పోయిన రైతులను ఓదార్చారు. అదేవిధంగా ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి భరోసా కలిపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

రైతుల గోసలు వర్ణణాతితం రైతుల తిప్పలు చూస్తుంటే కండ్లలోంచి నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. ఒక రైతు నాలుగున్నర ఎకరాల పంట వేసిండు నాలుగు ఎకరాల్లో మూడున్నర ఎకరాల పంట ఎండిపోయిందని ఒక అద్ద ఎకరం కోసం కిలోమీటర్లు నుండి వాటర్ తెస్తుండని ఆయన అన్నారు. వేసిన పంటను రక్షించుకోవడానికి రైతు చేసే ప్రయత్నం ఒక రైతుకే తెలుస్తుందని తెలిపారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. బూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరు బావులు లలో నీళ్లు లేక వేసిన వరి పంట చేలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయని తెలిపారు. అదే ఈ కాలం నీళ్లు ఉంటే వేసిన పంట చేతికి వచ్చి ఇంటినిండా వరి పంట రాశులు ఉండేవి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తు లక్ష ఎకరాలకు మూడు ఎకరాలకు ఒక పైపులైన్ చొప్పున మంచిప్ప, మాసాని,బైరాపూర్ దగ్గర భైరపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్ నుండి సాగు నీరు వస్తే అన్ని పైప్ లైనింగ్స్ భూమిలో ఉన్నాయి ఈ ఈ పైప్ లైనింగ్స్ ద్వారా పంట పొలాలకు సాగు నీటిని సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఏమైనవని రూరల్ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. రైతుల గోసులను పట్టించుకోరా. రైతులకు ఇచ్చిన మాటలను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరైతే రైతులు పైప్ లైన్స్ వేసారో వాళ్ళ కాలవ్యవది కూడా పూర్తి కావస్తుందని అయినా పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులు వేసుకున్న పైపులు కూడా భూమిలోనే కూడుకు పోయే పరిస్థితి ఏర్పడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదు. రైతులు వేసిన పంటలను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా పంట పొలాలకు నీటిని సరఫరా చేసిన నీళ్లు సరిపోతాలేవని అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు పంపించి ఎండిన పంటలను అంచనా వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. లేదంటే రైతుల రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం లో సాగు నీటి కోసం పంపు హౌస్ కట్టివుంటే ఈరోజు రైతుల పరిస్థితి ఇలా జరిగేదా అని కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు జిర్ర మైపాల్ యాదవ్, సిరికొండ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, ఇందల్వాయి మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, నేతలు కర్క గంగారెడ్డి,కోమటి దాసు, చిలుక మహేష్,చిలక నరేష్, నాయుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *