*బిజెపి మండల అధ్యక్షుడు పాపన్న గారి వేణుగోపాల్ పేరు చెప్తే అధికారులకు పోలీసులకు వణుకు…
*వామ్మో గ్రామ కంఠం ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్…
*ప్రక్కనే ఉన్న తన వాహనానికి పట్టాభూమికి ఎసరు…
*అసలైన భూమి వాళ్లు పూజ చేసేసరికి బాగోతం బయటపడింది….
A9 న్యూస్ ప్రతినిధి:మాసాయిపేట మార్చి 10:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తమ స్థలం హద్దులను చూపించి పాత ఇంటి పై గ్రామ కంఠం క్రింద గిఫ్ట్ డిడి ద్వారా తనుభూమిని మాసాయిపేట మండల బిజెపి అధ్యక్షుడు వేణుగోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని బాధితులు చిట్యాల సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల సత్తయ్యతో పాటు అన్నదమ్ముళ్ల పిల్లలు ఆవేదన వ్యక్తపరిచారు అనంతరం పాపన్న గారి వేణుగోపాల్ బిజెపి అధ్యక్షుడు తన ఇంటి నంబర్ గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను ఇవ్వగా ఆ నెంబర్ తో రెవెన్యూ అధికారులను మోసం చేసి 277 సర్వే నెంబర్ గల 75 గజాల ఇంటి స్థలాన్ని హద్దులను చూపిస్తూ అదే గ్రామానికి చెందిన రజక సత్యనారాయణ తన కుమారుడైన వేణుగోపాల్ ప్రస్తుత బీజేపీ మండల అధ్యక్షుడు గత ఎడాది డిసెంబర్ 3న గిఫ్ట్ డిడి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆదివారం చిట్యాల సత్తయ్య కుటుంబ సభ్యులు తమ 75 గజాల ఇంటి స్థలంలో భూమి పూజ చేసుకోవడానికి వెళ్ళగా రజక సత్తయ్య కుటుంబం సభ్యులు తమ స్థలంలో ఎలా భూమి పూజ చేస్తారంటూ తమను అడ్డుకోవడంతో గొడవ జరిగిందని అన్నారు. అనంతరం రజక సత్యనారాయణ తమ స్థలంలో అక్రమంగా భూమి పూజ చేస్తున్నారంటూ చేగుంట పోలీస్ స్టేషన్ లో తమపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు నిజమైన భూమి బాధితులు చిట్యాల సత్తయ్య పత్రికా వాళ్ళందరికీ ఫోన్ చేశారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర నాయకుల అండదండల తో తమపై అక్రమంగా కేసులు చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా తమ స్థలం హద్దులను ఎలా రిజిస్ట్రేషన్ చేయించారంటూ బాధితులు మండిపడ్డారు. అక్రమ డాక్యుమెంట్లను సృష్టించి తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆగ్రహంతో ఇదెక్కడి న్యాయం గ్రామంలో ఎవరు లేరా అని విచారం వ్యక్తపరిచారు. ఇంత జరుగుతున్న వారి పార్టీ కను సైగలలోనే ఈ భూబాగోతాలు నడుస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగ డాక్యుమెంట్ సృష్టించిన అధికారులపై తక్షణమే విచారణ జరిపి వేణుగోపాల్ తో పాటు ఎవరెవరి సహాయం తీసుకున్నారు అనేది బయటపడి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.