హైదరాబాద్:ఫిబ్రవరి 28
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ హైద రాబాద్ కు చేరుకున్నారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేష న్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీ సీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు.
గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగ నుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్ష తన జరగనున్న ఈ సమావే శంకు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరుకాను న్నారు.
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షు లు, పీసీసీ ఆఫీసు బేరర్లు సమావేశంలో పాల్గొనను న్నారు. ఇన్‌చార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ మొదటి సారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
దాంతో ఆమె ఏ విధంగా మాట్లాడనున్నారనే ఆసక్తి పార్టీ నేతల్లో నెలకొంది.ఈ సమావేశం మీనాక్షి నటరా జన్‌తో రాష్ట్ర నేతల పరిచ య కార్యక్రమం మాత్రమే నని, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది.
బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షి నటరాజ న్‌ను కలిసి విజ్ఞప్తి చేయను న్నట్లు సమాచారం. మీటింగ్ అయిపోయిన వెంటనే ఏఐసీసీ కార్యదర్శి తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నా రని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.