ఎక్కడి దావత్ లకు అక్కడే పుల్ స్టాప్..

 

 

సర్పంచ్ ఎన్నికలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే గ్రామస్థాయి, జిల్లా స్థాయి ని మొదలుకుని వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి వరకు ఈ ఎన్నికలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో తమ పార్టీ జెండా ఎగిరితేనే పార్టీ బలం పెరుగుతుందనేది రాజకీయ పార్టీల ఆలోచన. అందుకే కిందా మీద పడైనా సరే.. గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చూపాలని కొంత కాలంగా అన్ని రాజకీయ వేదికల్లో అందరు లీడర్లు, అన్ని పార్టీలు తమ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే గ్రామాల్లో ఆశావహులంతా చాలా ముందు నుంచే వారి ప్రయత్నాల్లో వారున్నారు. గ్రామాల్లో పట్టు తప్పిపోకుండా ఉండేందుకు అవసరమైన ప్రధాన అనుచరులను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి నిన్నా మొన్నటి వరకు తెగ తంటాలు పడ్డారు. రిజర్వేషన్ లు ఖరారు కాకపోయినా, నోటిఫికేషన్ రాకపోయినా ఎక్కడా తగ్గకుండా ప్రతిరోజు దావత్ లే దావత్ లంటూ ఇప్పటికే దాదాపు రూ. లక్షల్లో ఖర్చులు చేసుకున్నారు. తీరా స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు లేనట్లేనని సర్కారు హింట్ ఇవ్వడంతో..ఎక్కడోల్లక్కడ సల్లవడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలు, పదో తరగతి పరీక్షలు వంటి అనేకానేక అంశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకులు పడ్డట్లే అని తేలడంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి..

 

ఎక్కడి దావత్ లకు అక్కడే పుల్ స్టాప్..

 

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ప్రజల్లో ఆదరణ కోల్పోకుండా ఉండేందుకు నానా తంటాలు పడ్డ ఆశావహులకు గట్ట షాక్ తగిలింది. సర్పంచ్ ఎన్నికలకు ఇంకా ఆలస్యం కానుందన్న విషయాన్ని ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి దాకా ప్రతిరోజు దావత్ ల కోసం భారీగా ఖర్చు చేయడమే కాకుండా అనుచరులకు అవసరమైనప్పుడల్లా చేబదులుగా వేలాది రూపాయలు ఇచ్చిన ఆశావహులు భారీగానే ఖర్చు చేసుకున్నట్లు తెలుస్తోంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *