పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 11
పెద్దపెల్లి జిల్లా మంథనిలో ఆందోళన చేశారు దళిత బంధు సాధన సమితి నేతలు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ అకౌంటులో సీజ్ చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంథని పాత పెట్రోల్ బంక్ వద్దగల రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మంథని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దళిత బంధు నిధులు విడుదల చేయకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెబుతామని, అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ విడుదల విషయంలో ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చొరవ చూపాలని కోరారు.
ఇప్పటికే 25 నియోజకవ ర్గాలలో దళిత బంధు నిధులు కలెక్టర్ల అకౌంట్స్ లో ములుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు దళిత బంధు నిధుల విషయంలో సహకరించిన పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిం చారు.