మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 9
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వెంగలి అనిత అనారోగ్యంతో నేడు ఆదివారం మరణించింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటికి పెద్దదిక్కు బెంగాలీ కర్ణ అనారోగ్యంతో మరణించారనీ తెలిపారు. అప్పటినుండి మానసిక వికలాంగులైన ఇద్దరు ఆడపిల్లలు పోషించడానికి తల్లి రోజు కూలి నాలి పనిచేసి పోషించేది.
నేటి వరకు ఉన్న ఒక్క తల్లిని కూడా కోల్పోయి ఆ ఇద్దరి ఆడపిల్లల వద్ద తల్లి అంత్యక్రియలు చేయడానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనీ చుట్టుపక్కల ప్రజలు దాతలు స హృదయంతో ఆదరించి చిన్నారుల మనసు బాధపడకుండా ప్రతి ఒక్కరు సహకరించి దాన సంస్కారాలు చిన్నారులకు ఆదుకునే విధంగా సహాయ సహకారాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డిఎస్ శ్రీనివాస్, పట్నం శివరాములు, మఠం పవన్, వివిధ యువ నాయకులు అధికారులు అనధికారులు బిజినెస్దారులు వివిధ సంఘాల యువకులు ప్రజాప్రతినిధులు తోచిన సహాయం చేస్తున్నట్లు సమాచారం అనంతరం పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు