A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్:
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య (41) సంవత్సరాలు గల వ్యక్తి తన ఇంట్లో నిన్న అర్ధరాత్రి పూట అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.