A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ నేషనల్ హైవే ఫ్లై ఓవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఏపీ 16 టిజే 3559 గల లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రాంగ్రోట్లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్మూర్ డిపో ఆర్టీసీ బస్సును ఢీకొనడం జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులకు సాధారణ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 సహాయంతో తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు..