భూపాలపల్లి జిల్లా ఫిబ్రవరి 06
భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,
పోలీసుల వివరాల ప్రకారం.. కాటారం మండలంలోని సబ్ స్టేషన్ పల్లి కి చెందిన తోట రవి అనే వ్యక్తి ద్విచక్ర ఇంటికి వెళుతుండగా కాళేశ్వరం నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఇసుక లారీ బైకును ఢీకొట్టడంతో తోట రవి అనే వ్యక్తి కింద పడిపోగా. అతని కాళ్లు పై నుండి లారీ టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలైన రవిని హనుమకొండ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..