*రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాక్కునే చర్యలు బడ్జెట్ లో పెట్టిన బిజెపి*

 

*కార్పొరేటీ కరణ ప్రైవేటికరణ కోసం బాటలు వేస్తున్న బిజెపి*

 

*ఆర్ఎస్ఎస్ వ్యూహాలు విద్యలో అమలుకుబిజెపి చర్యలు*

 

*SFI రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్*

 

 

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపింది.విద్యను మరింత కార్పొరేట్, ప్రైవేటీకరణకు దగ్గర చేస్తున్న విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది.గతం కంటే విద్యారంగానికి బడ్జెట్లో నామమాత్రంగా 0.2% మాత్రమే పెరిగింది 12467.39 కోట్ల నుండి 12500 మాత్రమే విద్యారంగానికి నిధులు పెరిగాయి.ఈ నిధులు విద్యారంగా అభివృద్ధికి ఏమాత్రం సరిపోవు,ఇప్పటికే పాఠశాల విద్యకు దేశంలో నిధుల కొరత తీవ్రగా ఉంది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యకు 73008 కోట్ల నుండి 78572 కోట్లకు నిధులు కేటాయించారు. 500 కోట్లు మాత్రమే పెంచారు ఇలా బడ్జెట్ లో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని వారు అన్నారు.ఉన్నత విద్య కోసం నామమాత్రంగానే 2025-2026 బడ్జెట్ కనిపిస్తుంది రూ 47619.77 కోట్ల నుండి రూ 50077.95 కోట్లకు కేవలం 5% మాత్రమే పెరుగుదల చూడవచ్చు,కాబట్టి విద్యారంగానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని వారు అన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *