హైదరాబాద్:ఫిబ్రవరి 02
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన ట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం వార్తలు వస్తున్నాయి.
ఓ మంత్రి వ్యవహార శైలిపై వీరు గుర్రుగా ఉన్నారని.. పనుల కోసం కలిసి ఒత్తిడి చేద్దామని భేటీలో చర్చించినట్లు గత రెండు, మూడ్రోజులుగా ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం జరిగిన మంత్రుల భేటీలో ఈ వ్యవహారంపై చర్చ జరగ్గా.. గట్టిగానే వ్యవహరిద్దామని సీఎం, కొందరు మంత్రులు పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే లు సమావేశమైన మాట నిజమేనని స్పష్టం చేసారు. కానీ తాము రహస్యంగా భేటీ కాలేదని చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవద్దా? అని ప్రశ్నించారు.
తాను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదన్నారు. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీని కలిశాక పూర్తి వివరాలు చెబుతానని అన్నారు.