నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణంలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలు ఇట్టి దరఖాస్తు ప్రక్రియ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంచడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని అనివార్య కారణాలవల్ల కొందరు ఈ మూడు రోజులలో దరఖాస్తు చేసుకోలేకపోయారు మరియు ప్రజలు చెప్పేదేమీ చెప్పేటటువంటి విషయం ఏమంటే కేవలం మాకు మూడు రోజులు మాత్రమే.
ఈ గృహలక్ష్మి పథకానికి సమయం ఇవ్వడం జరిగిందని కానీ మాకు ఈ విషయం కొద్దిగా ఆలస్యంగా తెలిసినందుకు మరియు కొందరు అనివార్య కారణ వలన తమ సొంత గ్రామాల్లో లేకపోవడం వలన దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అధికారులు ఇట్టి విషయంపై స్పందించి ప్రజలకు మేలు చేకోరేలా గృహలక్ష్మి పథక గడువును నాలుగు రోజులపాటు పొడిగించాలని ప్రజలు అధికారులను విన్నవించుకుంటున్నారు.