హైదరాబాద్:జనవరి 29
హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం జరుగుతుండగా వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు చేశారు.
కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.
వ్యభిచార గృహం నిర్వాహ కుడి కోసం మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది.