భక్తుల కొంగు బంగారం శ్రీ అయ్యల స్వామి 

 

అత్యంత దివ్య ప్రదేశం అయ్యల గుట్ట 

 

రేపే శ్రీ అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర 

 

వేలాదిగా తరలిరానున్న భక్తజన సందోహం 

 

*సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం*

జనవరి 28:మంగళవారం 

ఆర్మూర్ డివిజన్ లోని వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ శివారులో గల శ్రీ అయ్యల గుట్ట పై వెలసిన శ్రీ అయ్యల స్వామి ఈ ప్రాంత భక్తుల పాలిట కొంగుబంగారమై వెలసిళ్లుతున్నాడు. ప్రతి యేటా మాఘమ అమావాస్య రోజున ఇక్కడ జరిగే జాతరకు జిల్లాలో నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. చుట్టూ గ్రామాలైన దోన్ పాల్, బషీరాబాద్, చౌటపల్లి, కుప్కాల్, జగిర్యాల్, సుంకేట్, వేల్పూర్, మోతె, ఆక్లూర్, భీమ్ గల్, మోర్తాడ్ గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

భక్తులు హరహర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అంటూ ఎడ్ల బండ్లు, ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు, ఆటోలల్లో తరలి వస్తారు. ఆర్టీసీ వారు జాతర సందర్బంగా గ్రామం నుండి గుట్ట వరకు జాతర స్పెషల్ బస్సులను నడుపుతారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక గ్రామాభివృద్ధి కమీటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేస్తారు. జాతర సందర్బంగా గ్రామాలయం నుండి స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో పాదయాత్రన ఊరేగింపుగా గుట్టకు తీసుకెళ్తారు. అయ్యల గుట్టపై స్వామి ఆలయం పై జెండాను ఆవిష్కరణ చేసి కింద స్వామి వారి గద్దెపై ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి పల్లకి ముందు బలిప్రధానం చేసి స్వామి ఉత్సవమూర్తులతో పల్లకిని అయ్యాలగుట్ట చుట్టూ గిరి ప్రధక్షణ గావిస్తారు. ఈ గిరిప్రధక్షనలో స్వామి పల్లకి వెనుక భక్తులు స్వామి నామ సంకీర్తనలు పాడుకుంటూ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, వాహనాలపై గిరి ప్రధక్షణ చేయడం ప్రత్యేకం. అనంతరం రాత్రికి పెద్ద శావ పై స్వామి ఉత్సవమూర్తులను ఉంచి బంగారవ్వ నుండి గ్రామాలయం వరకు మహిళా భక్తుల మంగళహరతులు, భజనలు, కొళాటాలు, స్వామి సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా గ్రామం లో ఊరేగింపు నిర్వహిస్తారు.

స్థల పురాణం….

 ఈ అయ్యల గుట్ట క్షేత్రం అత్యంత పవిత్రమైన క్షేత్రమని పూర్వీకులు చెబుతారు. ఈ ప్రాంతం లో మునులు, ఋషులు తపస్సు చేసుకొనేవారని, ఇక్కడ ఎవరైనా నిద్ర చేస్తే గంటనాదాలు, భజనలు వినిపిస్తాయని చెబుతారు. ఇక్కడ కొన్ని యేండ్లుగా కోనేరు ఉండేది. ఆ కోనేరు వద్దకు ప్రాతః కాలం ఉదయం 3 నుండి 4 గంటల ప్రాంతం లో మునులు, ఋషులు స్నానమాచరించడానికి వస్తారని ప్రతిథి. ఇలాంటి దివ్యమైన క్షేత్ర ఈ ప్రాంతంలో ఎక్కడ లేదని ఈ ప్రాంతంలో నివసించే మహారాజు ఇప్పటికి చెబుతుంటారు. శ్రీ అయ్యాలగుట్ట వద్ద జపతపం చేసుకోవడానికి ఇప్పటి మారుజులు, సన్యాసులు, దివ్యపురుషులు ఇవ్వులురుతుంటారు అంటే అతిషయోక్తి కాదు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *