A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనంలో యు,ఆర్,టి,పి మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి జర్నలిస్టులకు పదివేల రూపాయలు మంగళవారం అందించారు.జర్నలిస్టులు ఆడబోయే క్రికెట్ పోటీలకు తన వంతుగా మొన్న చెప్పిన విధంగానే 10000 రూపాయలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్,నెమిలి ప్రశాంత్ కు అలాగే సభ్యులకు నగదు ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగదుతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ అడగకుండానే ముందుకు వచ్చి మా క్రీడ పోటీలను ప్రోత్సహిస్తున్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర పార్టీ మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి కి ప్రెస్ క్లబ్ ప్రతి ఒక్కరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.