హైదరాబాద్:జనవరి 28
స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పేంపొందించుకుంటూ, అత్యంత్తమ భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా ఎదిగిన ఇస్రో.. తన 100వ ప్రయోగాన్ని రేపు బుధవారం చేపట్టనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు జీఎస్ ఎల్వీ-ఎఫ్15 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి ఎగరనుంది.
దేశీయంగా తయారు చేసిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా.. ఎన్వీఎస్-02 అనే శాటిలైట్‌ను ఇస్రో అంతరి క్షంలోకి పంపించనుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారు జామున 2.52 గంటలకు ప్రారంభం అయింది.
27 గంటల పాటు కొనసాగ నున్న ఈ కౌంట్‌డౌన్.. రేపు ఉదయం 6.23 గంటలకు ముగిసిన తర్వాత నింగి లోకి ప్రవేశించనుంది.
ఈ జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం కోసం ఇప్పటికే దాన్ని షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించారు. జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఈ జీఎస్ఎల్వీ- ఎఫ్15 రాకెట్.. 17వది కాగా.. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్ కావడం గమనార్హం.
ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02.. ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ఇస్రో శాస్త్ర వేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ.. నావిక్ మరింత విస్తృతం కానుందని సైంటిస్ట్‌లు వెల్లడించారు.