దావోస్: స్విట్జర్లాండ్‎లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్‌) 2025 వార్షిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వేట ప్రారంభమైంది. ఈ మేరకు దావోస్‎లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్‌, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు , అధికారుల బృందం మంగళవారం సమావేశమయ్యారు. యూనిలీవర్ వంటి గ్లోబల్ FMCG దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార అవకాశాలపై సీఎం రేవంత్ బృందం చర్చించారు. ఈ మేరకు దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం చేసుకున్నారు.

 

యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని తెలంగాణ ప్రతినిధుల బృందం తెలిపారు. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్‌ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలీవర్‌ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ బృందం పేర్కొన్నారు.

 

కాగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్‌, 20 నుంచి 22 వరకు దావో‌స్‌లో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌బాబు ఉంటారు. సింగపూర్‌లో స్కిల్‌ యానివర్సిటీతో ఒప్పందాలు చేసుకుంటారు. దాంతోపాటు.. పలు సంస్థలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతారు. దావో‌స్‌లో జరగనున్న డబ్ల్యూఈఎఫ్‌ సందర్భంగా ప్రవాస భారతీయులతో భేటీకానున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *