*కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారు*
*వివాదాస్పదంగా ఏకశిలానగర్ భూముల వివాదం*
హైదరాబాద్, జనవరి 21: మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు మండిపడ్డారు. ‘‘ఏకశిలా నగర్ భూములకు యజమానుల మేము. ఈ వెంచర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి.. అన్నీ న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి. భూ యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారు’’ అంటూ మండిపడ్డారు. ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి.. తన అనుచరులతో విచక్షణారహితంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో మొత్తం ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని.. రక్తస్రావం వచ్చేలా ఈటల అనుచరులతో దాడికి దిగారన్నారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు తెలిపారు. కాగా.. పేదల భూములను కబ్బా చేశారంటూ ఏకశిలానగర్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మంగళవారం మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల ఈరోజు పర్యటించారు..