హైదరాబాద్: జనవరి 21
బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఈరోజు సాయంత్రం గుండె పోటుకు గురయ్యారు. ప్రస్తుతం.. కుటుంబంతో కలిసి డెహ్రా డూన్‌లో పర్యటిస్తున్న పద్మారావు గౌడ్‌కు ఒక్క సారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
అప్పటి వరకు కుటుంబ సభ్యులతో హుషారుగా ఉన్న పద్మా రావు గౌడ్‌కు గుండెపోటుకు గురికావ టంతో.. వెంటనే అప్రత్తమైన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లటంతో.. పద్మారావు గౌడ్‌కు వైద్యులు వెంటనే చికిత్స చేశారు. ఈ క్రమంలో.. పద్మారావుకు స్టంట్ వేశారు. దీంతో.. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని.. ప్రస్తుతం పద్మారావు గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
దీంతో.. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. పద్మారావు గౌడ్‌ను కుటుంబ సభ్యులు.. ఈరో జు రాత్రికే.. హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. పజ్జన్నా అని ఎంతో ప్రేమగా పిలుచుకునే తమ అభిమాన నేతకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో.. కార్యకర్త లు, అభిమానులు, బీఆర్ ఎస్ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
కాగా.. ప్రస్తుతం పద్మారావు గౌడ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. పద్మారావు గౌడ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఉన్నప్పటికీ.. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటికి తరలివెళ్లారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.