హైదరాబాద్:జనవరి 21
ఆంధ్ర మహిళ సభ కళాశాలలో సీఈసీ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భార్గవి, కాలేజీ వెనకాలే ఉన్న రైల్వే పట్టాలపై ఈరోజు ఆత్మహత్య చేసుకుంది,
సికింద్రాబాద్ పరిధిలో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
మంగళవారం ఉదయం జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసు కున్నట్లు తెలుస్తోంది. రైల్వే లోకో పైలట్ సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదే హాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.