హైదరాబాద్ :జనవరి 17 తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్ష ముగిసి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకూ ఆన్సర్ విడుదల కాకపోవడంతో అభ్యర్ధుల్లో అందోళన నెలకొంది. దీనికి చెక్ పెడుతూ.. టీజీపీఎస్పీ కమిషన్ ప్రకటన జారీ చేసింది.
రేపు శనివారం గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. శనివారం గ్రూప్ 2 ప్రాథమిక విడుదలైన తర్వాత అదే రోజు నుంచి నుంచి జనవరి 22 వరకు అభ్యర్థుల లాగిన్ లో ప్రాథమిక కీ అందు బాటులో ఉంటుందన్నారు.
కీతో పాటు అభ్యర్ధుల ఆన్సర్ షీట్లు అందుబాటు లో ఉంచుతారు. ప్రాథమిక ఆన్సర్‌కీపై అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అభ్యంత రాలను తెలపాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు.ప్రాథమిక కీపై జనవరి 18వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ సాయం త్రం 5 గంటల వరకు అభ్యం తరాలను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.
అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే తెలపాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు చెప్పదలచుకున్న అభ్యంత రాలకు తప్పనిసరిగా.. ఆ అంశం ఏ పుస్తకంలో నుంచి తీసుకున్నారో.ఎడిషన్‌తోపాటు పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు వంటి వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. అభ్యంత రాలను ఈ మెయిల్ ద్వారానే పంపాలన్నారు.