*45 రోజుల వేడుక.. రూ. 2,00,000 లక్షల కోట్ల బిజినెస్..*

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈరోజు (జనవరి 13) నుంచి మహా కుంభమేళా 2025 ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంగమ పవిత్ర జలాల్లో స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశంలో స్నానం ఆచరించి, పూజలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

 

నాలుగు ప్రధాన

 

కుంభమేళా భారతదేశంలోని నాలుగు ప్రధాన పవిత్ర స్థలాలలో జరుగుతుంది. హరిద్వార్ (ఉత్తరాఖండ్), ఉజ్జయిని (మధ్యప్రదేశ్), నాసిక్ (మహారాష్ట్ర), ప్రయాగ్‌రాజ్ (ఉత్తర్ ప్రదేశ్). ఈ సంవత్సరం ప్రధాన అమృత స్నానాలు జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి), ఫిబ్రవరి 12 (మాఘి పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహాశివరాత్రి) తేదీలలో ఉంటాయి.

 

రూ. 2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా

 

దీంతో ఈ సంవత్సరం మహా కుంభమేళాకు 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇది అమెరికా, రష్యా మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ మహా కుంభమేళా నిర్వహణ కోసం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగే ఈ మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కూడా శుభప్రదం అవుతుంది. ఈ మహా కుంభమేళా కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మహా కుంభమేళా 2025 ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

పెరగనున్న యూపీ జీడీపీ

 

ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే, ఈ కార్యక్రమం నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ.2 లక్షల కోట్లు అవుతుందని అంచనా. కొన్ని అంచనాల ప్రకారం భక్తుల తలసరి వ్యయం రూ. 10,000 వరకు చేరవచ్చని చెబుతున్నారు. అయితే అయితే మొత్తం ఆర్థిక ప్రభావం రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. దీంతో యూపీ జీడీపీ 1 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా. అయితే 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.2 లక్షల కోట్లు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అన్నారు. ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. దీంతో ఈసారి మరింత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

 

వివిధ వ్యాపారాల నుంచి ఎంత ఆదాయం

 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం మహా కుంభమేళా నుంచి వివిధ పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్‌లు, ఇతర ఆహార పదార్థాల వ్యాపారం దాదాపు రూ.20,000 కోట్ల టర్నోవర్‌ను సృష్టిస్తుందని అంచనా. దీంతోపాటు ప్రసాదం, మతపరమైన దుస్తులు, నూనె, దీపాలు, గంగా జలం, విగ్రహాలు, ధూపం కర్రలు, మతపరమైన పుస్తకాలు వంటి ఇతర ఉత్పత్తుల ద్వారా రూ. 20,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

 

ట్రావెల్ ప్యాకేజీలు..

 

ఇది కాకుండా స్థానిక, అంతర్రాష్ట్ర సేవలు, సరుకు రవాణా, టాక్సీ సేవలను కలిగి ఉన్న రవాణా, లాజిస్టిక్స్ రంగం రూ. 10,000 కోట్లు రానుంది. టూర్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీల వంటి పర్యాటక సేవల నుంచి కూడా రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే ఛాన్సుంది. తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, మందుల ద్వారా రూ.3,000 కోట్ల టర్నోవర్‌ను ఉత్పత్తి చేస్తాయని అంచనా వేశారు. వినోదం, ప్రకటనలు, ప్రచార కార్యకలాపాల ద్వారా మరో రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను ఉత్పత్తి చేస్తాయని అంచనా.. KP

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *