నిర్మల్ జిల్లా: జనవరి 10

నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరో జుల క్రితం భైంసాలో, ఖానాపూర్‌ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు బయటపడ్డా యి. దీంతో వినియోగదారు ల్లో, వ్యాపారస్థుల్లో ఆందోళ న మొదలైంది.

 

అచ్చుగుద్దినట్లు కలర్‌ జిరాక్స్‌ :నకిలీ నోట్లను స్థానికంగా ముద్రిస్తున్నారో, లేక వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ వాటిని చెలామణి చేస్తున్నా రో అనే విషయంలో పూర్తి స్పష్టత లేదు. కానీ దొంగ నోట్లు చెలామణి మాత్రం కొనసాగుతోందనే విషయం నిర్ధారణ అవుతోంది.

 

వాస్తవమైన నోట్లను ప్రతిబింబించేలా మందంగా ఉన్న కాగితాన్ని ఉపయోగి స్తూ కలర్‌ జిరాక్స్‌ చేసి నోట్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో తాజాగా జరిగిన ఘటనలో రెండు రూ.200 నోట్లు దొరికాయి. రెండిం టిపైనా ఒకటే నంబరు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

చిన్న నోట్లు రూ.200, రూ.100 అయితే సుల భంగా మార్చేయవచ్చన్న ఆలోచనతో వాటిపై ప్రధా నంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.మార్కెట్లో చెలామణి అవుతున్న నకిలీ రూ.200 నోట్లను చూడగానే గుర్తు పట్టేవారు కాకుండా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుంటు న్నారు.

 

అది కూడా రద్దీ ప్రదేశాల్లో నే. దీంతో నోట్లు మార్చుకొని సులభంగా, వేగంగా అక్కడి నుంచి పారిపోయే అవకా శం ఉంటుంది. బేరసా రాలకు తావు లేకుండా వ్యాపారస్థులు అడిగిన రేటుకే వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

 

నిర్మల్ జిల్లాలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తులు డబ్బులు చెలామణి చేసే క్రమంలో నకలీ నోట్లను సైతం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. జిల్లాలో అక్కడక్కడా వెలుగు చూస్తున్న ఈ ఘటనలు దొంగ నోట్ల విషయాన్ని తెలియజేస్తు న్నాయి.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *