హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో ట్వీట్ చేశారు. ఒక్క సీఎంను ఎన్నుకుంటే… ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని కేటీఆర్ విమర్శించారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థను స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదేమో అని ఆక్షేపించారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని సెటైర్లు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి తనది ఒక చిన్న విన్నపమని.. ప్రజాపాలన కాబట్టి ప్రజలకు మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణలో IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడాలని కేటీఆర్ విమర్శించారు..