హైదరాబాద్: జనవరి 09
ఫార్ములా ఈ- రేస్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కాను న్నారు. ఉదయం 10గంట లకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆయనను గృహ నిర్బంధం చేశారు. అటు కేటీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు.
కవిత భర్త అనిల్ తో కలిసి ఆమె అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మాదేవేం దర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తదితరులు అక్కడికి చేరుకున్నారు.
అడ్వకేట్ రామచంద్రరావు, లీగల్ టీమ్ తో కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు.