హైదరాబాద్ జనవరి 07
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వివరాలను వెల్లడించారు..
ఫిబ్రవరి 5న పోలింగ్, 8న ఫలితాలు వెల్లడికానున్నా యి, ఫిబ్రవరి 15తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియ నుంది.. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటికే పలు నియోజక వర్గాలకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి..