*దళిత ఫోరం జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ జే మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ డిమాండ్*
*జర్నలిస్టులు అంటే విలువనే లేదు రాజకీయ నాయకులకు?*
జర్నలిస్టుల లోపమా? నాయకులలోపమా?
చత్తీస్గఢ్ రాష్ట్రంలో
జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ హత్య ను దళిత ఫోరం జర్నలిస్ట్ మెదక్ జిల్లా టి యు డబ్ల్యూ జే ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తపరిచారు అనంతరం ముకేశ్ చంద్రకర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. అవినీతి, గిరిజన సమస్యలపై వార్తలు రాశారు. ‘బస్తర్ జంక్షన్’ను నడుపుతున్నాడు . అవినీతిని వెలికి తీసినందుకు ముకేశ్ చంద్రకర్ ను హత్య చేయడం అంటే ప్రజాస్వామ్యం ను చంపింట్లే అవుతుంది. హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు