హైదరాబాద్: జనవరి 07

చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (HM PV) భారతదేశంలోనూ కలకలం సృష్టిస్తుంది. ఈ వైరస్ కు సంబంధించిన కేసులు భారత్ లోనూ నమోదయ్యాయి.

 

అయితే, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం వరకు భారతదేశంలో ఏడుగురు ఈ వైరస్ భారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో రెండు కేసులు నమోదు కాగా.. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఒకరికి HMPV వైరస్ సోకినట్లు నిర్దారణకాగా..

 

తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ గా తేలింది. ఏడేళ్లు, 13 ఏళ్ల చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నా రని అధికారులు తెలిపారు. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

 

హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగు తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ను ఎధుర్కొనేందుకు కొవిడ్ -19 సమయంలో అనుస రించిన విధంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభు త్వాలు మార్గదర్శకాలను జారీ చేశాయి.

 

హెచ్ఎంపీవీ వైరస్ 2001 నుంచి ఉన్న వైరస్ అని ఆందోళన అవసరం లేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశ ప్రజలకు తెలిపా రు. మరోవైపు హెచ్ఎంపీవీ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తోనూ భార త ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది.

 

చైనాలో హెచ్ఎంపీవీ విజృంభిస్తుండటంతో అక్కడి ఆస్పత్రులు రోగుల తో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభు త్వం ఇప్పటికే అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటిం చింది. చైనాలో ఇన్‌ఫ్లు ఎంజా A, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా COVID-19తో సహా పలు వైరస్‌లు వేగంగా వ్యప్తి చెందుతున్నాయి.

 

దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని అక్కడి ప్రజలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *