నిజామాబాద్ A9 news
ఆజాధికా అమృత్ మహోత్సవాల ముగింపు కార్యక్రమాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో “మేరీ మట్టి – మేరా దేశ్” “నేను పుట్టిన నేల… నను కన్న దేశం” ఈ దేశం కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వతంత్ర యోధులను స్మరించుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ లో ఉన్న స్వతంత్ర సమరయోధులు స్వర్గ కర్ణ విటల్ గౌడ్, కర్ణ లక్ష్మీబాయి, విట్టల్ గౌడ్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు లోక భూపతి రెడ్డి పూలమాలు వేసి శాలువాతో సన్మానించడమైనది.
ఈ యొక్క లక్ష్మీబాయి కి 90 సంవత్సరాలు ఉండి ఆరోగ్యంగా ఉండడం విశేషం. అదేవిధంగా లక్ష్మీబాయి, భర్త విటల్ గౌడ్ స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పనిచేయడంతో నాలుగు నెలల పాటు జైల్లో తన జీవితాన్ని గడపడమైనది. గతంలో విఠల్ గౌడ్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆర్మూర్లో ఏకగ్రీవంగా మున్సిపాలిటీ కౌన్సిలర్ గ ఎన్నికవడం కూడా జరిగింది. అంతేకాకుండా వీరి సేవలకు గుర్తింపుగా 1972లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డును కూడా పొందడం జరిగింది. ఇలాంటి వ్యక్తి యొక్క అయినటువంటి కర్ణ లక్ష్మీబాయి ని శాలువా, పూలదండతో సన్మానం చేసి గౌరవించడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణం కృష్ణ గౌడ్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ మరియు మండల అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.