నిజామాబాద్ A9 news
నిజామాబాద్ నగరంలో పర్యటనకు వస్తున్న ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని సిపిఎం పార్టీ మరియు సిపిఎం ప్రజాసంఘాల నాయకులను కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తూ అర్ధరాత్రి నుండి పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం సరైన పద్ధతి కాదని ప్రజా సమస్యల పైన నిత్యం పనిచేస్తున్న కార్యకర్తలను నిర్బంధించటం మూలంగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది తప్ప ప్రభుత్వానికి ఉపయోగ ఉండదని, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఖండించారు.
అరెస్టు చేసిన కార్యకర్తలను నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లాలో ఇండ్ల స్థలాల కోసం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఇండ్ల పట్టాల కోసం అనేక సంవత్సరాలుగా పేదలు తిరుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వము మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రారంభోత్సవాలు మాత్రం హడావుడిగా చేస్తూ ఉద్యమకారులను నిర్బంధించటం ఎక్కడి ప్రజాస్వామ్యమని ఆయన విమర్శించారు. పోరాటం చేయకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా, పోరాటాలు చేయకుండానే ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందా ఆలోచించాలని ఆయన అన్నారు.
నిర్బంధాల ద్వారా ప్రజల గొంతులు నొక్కటం సరైనది కాదని ప్రభుత్వం తన వైఖరిని విడనాడి అక్రమ అరెస్టులను మానుకోవాలని ,పేదలకు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ,58 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు నగర నాయకులు కటారి రాములు, దేరంగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.