*ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భవ వేడుకలు షాద్ నగర్ పట్టణంలోని ప్రతిభ కాలేజీలో నిర్వహించడం జరిగింది*

*జెండా ఆవిష్కరించిన SFI రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్*

 

 

 

విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు… మంగళవారం రోజున ప్రతిభ కాలేజీలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ హాజరై స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970లో డిసెంబర్ నెలలో ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఏర్పడిందన్నారు విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారత దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం గా అవతరించిందన్నారు నాటి నుండి నేటివరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఈ భారత దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళుతుందన్నారు దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు ప్రైవేట్ కార్పొరేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్య రంగాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర దగ్గరికి వస్తున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య సమస్యలను బాగుచేయలన్నారు లేదంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ను రానున్న ఎన్నికలలో విద్యార్థులే గద్దె దింపుతారు అన్నారు.ఈ కార్యక్రమంలో SFI టౌన్ అధ్యక్షులు సుమయిర్ మరియు నాయకులు ముకీద్ షైబాజ్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నార

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *