హైదరాబాద్:డిసెంబర్ 28
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం సృష్టిస్తుంది. ఇవాళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎం డీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి,లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని నోటీసులో పేర్కొంది.
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారం గా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకత వకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివే యాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరె స్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగించవ చ్చని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేప ట్టిన హైకోర్టు.. కేసు విచార ణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ‘కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని’ ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. విచా రణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటిం చారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరె స్ట్ చేయవద్దని, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.