-ఓపి సేవలో గంట సమయం వేచి ఉండాల్సి వస్తుందని రోగులు ఆవేదన…
-ఎమర్జెన్సీ కి ప్రత్యేక ఓపి సెంటను ఏర్పాటు చేయాలని రోగుల బంధువులు వెల్లడి…
-జిల్లా ఆసుపత్రికి సిబ్బందిని కొరత లేకుండా చూడాలని వెల్లడి…
A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో రోగులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ సేవల్లో ఇబ్బందులు తలెత్తడంతో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడినా ఓపీ ఇవ్వడం లేదని రోగులు వాపోయారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోగుల సంఖ్య, అదేవిధంగా ఓపి సేవలను వద్ద గంటలకు రోగుల బంధువులు నిల్చడం పట్ల ఆగ్రహ వ్యక్తం చేసిన బంధువులు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి నమ్మకం కుదిరిందని, ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లాలంటే పేదలకు భయంతో పాటు డబ్బు ఖర్చు అధికంగా దోచుకుంటున్నారని, ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే, సిబ్బంది కొరత ఉన్నట్లుగా రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు, ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బందిని తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలపడం జరిగింది, కానీ ఇప్పటివరకు సిబ్బంది కొరత అలాగే మిగిలిపోయిందని ఇప్పటికైనా సిబ్బందిని అదేవిధంగా డాక్టర్లను నియమించి పేద వాళ్ళ యొక్క రోగాలను నయం చేసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందుకు వేలాలని రోగుల బంధువుల వెల్లడి మౌలిక సదుపాయాలను కల్పించాలని అదేవిధంగా తాగునీటి సమస్య, బాత్రూం సమస్యలను వెంటనే బాగు చేయాలని రోగులు తెలిపారు