– త్వరలోనే బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు టెండర్‌

 

– అన్ని వివరాలు 25లోగా టీపోల్‌లో నమోదు

3838 వార్డులు, 5,27,302 ఓటర్లు

 

– ఎన్నికల ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్‌

 

పంచాయతీ పోరుకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కొత్త రిజర్వేషన్‌లోనే ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు టెండరు పిలువనున్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌, పంచాయతీ రాజ్‌ కమిషన్‌ నుంచి నోటిఫికేషన్‌ రావడమే తరువాయి. ఈ పాటికే జిల్లాకు ఎన్నికల సామగ్రి 50శాతానికి పైగా చేరుకున్నది. అందులో ప్రిసైడింగ్‌, రిటర్నింగ్‌ అధికారులకు సంబంధించిన అంశాలతో ఉన్న ప్రింటింగ్‌ పేపర్లు ఉన్నాయి. అయితే, ఇటీవల కలెక్టర్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతీ విభాగానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా పంచాయతీ సమరానికి ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో అధికారులు చకచకా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

 

డిసెంబరు 21 ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం జనవరి చివరి వారం, లేదా ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులను సన్నద్ధం చేస్తున్నది. అందులో భాగంగానే ఈ నెల 7 నుంచి 12 వరకు మండలాల్లో ఓటరు ముసాయిదా తుది జాబితాను ప్రదర్శించారు. 16న మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ అప్రూవల్‌ తీసుకుని 17న మండలాల్లో ప్రదర్శించారు. 3838 పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అభ్యంతరాలు ప్రజల నుంచి రాకపోవడం వల అధికారులు ఎన్నికలను అదే పోలింగ్‌ కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఎన్నికల నాటికి ఒకటి లేదా రెండు కేంద్రాల మార్పులు ఉండవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. జిల్లాలో 441 జీపీలలో 3838 వార్డులు ఉన్నాయి. అందులో 5,27,302 ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,62,558 ఉండగా, మహిళలు 2,64,736 ఓటర్లు ఉన్నారు. పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు2178 అధికంగా ఉన్నాయి. ఇతరుల ఓట్లు ఎనిమిది ఉన్నాయి.

 

*_నూతన రిజర్వేషన్‌లోనే ఎన్నికలు_*

 

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలు పదేళ్లపాటు ఒకే రిజర్వేషన్‌ ఉంటుందని ప్రకటించి ఎన్నికలు నిర్వహించింది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు జరగకపోతే పాత రిజర్వేషన్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించే వారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వస్తే కులగణన చేపడ్తామని ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. ఆ మేరకు రాష్ట్రంలోని రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన చేపట్టింది. దీని ప్రకారం రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి సైతం నూతన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నర్విహించనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ముగ్గురు సంతానం కల్గిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల వెసులుబాటు కల్పించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎంతో కాలంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నా ముగ్గురు సంతానం ఉండటంతో పోటీ దూరంగా ఉన్న వారికి ఊరట లభించినట్లైంది.

 

*_టీపోల్‌లో అప్‌లోడ్‌_*

 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా నిర్ణయ అనే యాప్‌ను రూపొందించింది. ఆ యాప్‌లో టీ పోల్‌ పోర్టర్‌లో ఓటరు జాబితా వివరాలు, పోలింగ్‌ కేంద్రాలు వివరాలు ఈ నెల 25లోగా నమోదు చేయాలని ఆదేశించింది. నూతన ఓటరు పక్రియ కోసం ఎలక్టోరల్‌ అధాకారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు చేసుకునే వెసలుబాటును కల్పించింది.

 

*_బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు టెండర్‌_*

 

ఎన్నిక ప్రక్రియకు కీలకమైన బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌ చేయడానికి అధికారులు టెండర్లు పిలువనున్నారు. ఇప్పటికే జిల్లాకు ఎన్నికల సామగ్రి 50శాతానికి పైగా చేరింది. అందులో ప్రిసైడింగ్‌, రిటర్నింగ్‌ అధికారులకు సంబంధించిన అంశాలతో ఉన్న ప్రింటింగ్‌ పేపర్లు వచ్చాయి. త్వరలోనే అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు.

 

*_ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్‌_*

 

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడైనా నిర్వహించే అవకాశాలు ఉండటంతో కలెక్టర్‌ విజయేందిర బోయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతీ విభాగానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ఎన్నికలు ఎప్పడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఇటీవల నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆదేశించారు.

 

*_ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం_*

 

ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ శాఖ సిద్ధంగా ఉంది. అందుకు గ్రామ స్థాయిలోని పోలింగ్‌ కేంద్రాలను ఫైనల్‌ చేశాం. బ్యాలెట్‌ పేపర్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ ఎన్నికల కమిషన్‌, పంచాయతీ రాజ్‌ కమిషన్‌ నుంచి రాగానే పిలుస్తా

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *