నిజామాబాద్ A9 news
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా పేరొందిన ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడి 100 ఏళ్ళు పూర్తి అయింది. 1920లో హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంత ప్రజలు సాగునీటి కోసం అల్లాడిపోయారు అని, దీంతో అప్పటి నైజాం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించాలని 1923లో పునాదిరాయి వేసింది. ఎనిమిదేళ్ల శ్రమతో 30 టీఎంసీల సామర్థ్యం, 2.75లక్షలతో ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్మించారు. నేటికీ ప్రాజెక్టు కట్టడాలు చెక్కు చెదరకపోవడం విశేషం.