హైదరాబాద్:డిసెంబర్ 19

నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ హెచ్‌బీఎఫ్‌ ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నేటి నుంచి జనవరి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్‌ కొనసాగనుంది.

 

37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి, ఈరోజు ప్రారంభిస్తా రని,హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు డా.యాకూబ్‌ షేక్‌ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ.. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తు న్నామని, అన్నారు

 

వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచుర ణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించను న్నామని చెప్పారు. బుధవారం ఎన్‌టీఆర్‌ స్టేడియం ప్రాంగణంలో హెచ్‌బీఎఫ్‌ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో అధ్యక్షుడు డా.యాకూబ్‌ షేక్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

బుక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ 11 రోజుల పాటు కొనసాగు తుంది. సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్‌ను చూడవచ్చు. ఈ ఏడాది తొలిసారిగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయనున్నారు.

 

బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి మరియు ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయ భారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌గా నామకరణం చేశారు.

 

బుక్ ఫెయిర్ సందర్భంగా తెలంగాణ రుచులతో ఫుడ్‌ స్టాళ్లు ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమా లు, సాంస్కృతిక ప్రదర్శనలు సహా వైద్య శిబిరాలు కూడా ఉంటాయి.

 

పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపును అందిస్తు న్నామని హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని ఆఫర్‌ లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *