హైదరాబాద్:డిసెంబర్ 19

ఈరోజు 10 గంటలకే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో మూసీ నీటి వ్యవహారంపై అధికార- విపక్షాల మధ్య మాటల సాగింది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నల్గొండ జిల్లాలో మూసీ నీటి గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు.

 

ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సమాధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు రియాక్ట్ అయ్యారు. దీంతో అధికార-విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

హ‌రీష్‌రావు-మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేశారని మంత్రి ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నిండా నీళ్లు దాచుకుందని అన్నారు.

 

బీఆర్ఎస్ హయాంలో నల్గొండను నిర్లక్ష్యం చేశారని, అందుకే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారన్నా రు.తన‌ను ప్ర‌శ్నించే హ‌క్కు హ‌రీశ్‌రావుకు లేద‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌ రెడ్డి, డిప్యూటీ లీడర్‌వా? ఏ హోదాలో మైక్ అడుగు తున్నావు, మాట్లాడుతు న్నావని, ప్రశ్నించారు.

 

ఏడాదిగా ప్రతిపక్షనేత సభకు రాకపోవడాన్ని గుర్తు చేశారు.ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఒక్కసారి రాలేదన్నా రు సదరు మంత్రి. బీఆర్ ఎస్‌కు సభలో లీడర్ లేదు, డిప్యూటీ నేత లేరు..

 

ఆయన కేవలం శాసనస భ్యుడు మాత్రమేనన్నారు. ఈలోగా స్పీకర్ జోక్యం చేసుకున్నారు. మనం పెట్టుకున్న రూల్స్‌ని మనమే బ్రేక్ చేస్తామా? అంటూ స్పీకర్ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని, వెల్‌లోకి ఎవరూ వెళ్లవద్దని సూచన చేశారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *