కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :. 18 డిసెంబర్
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికిచెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ నీలం రవి మరియు బీఆర్ఎస్ యూత్ నాయకులు నరేష్, రాజు, సీహెచ్ రాకేష్, బిట్టు,సురేష్, మహేష్, మజ్జు, అక్రం మరికొంత మంది ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరరు .
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలొ జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వములో ప్రజాపాలనలో, ప్రజా సేవలో పాలుపంచుకోవడానికి కాంగ్రెస్ పార్టిలో చేరిన వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నీలం రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన జరుగుతుందని, బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనసున్న నాయకుడిగా పేరు సంపాదించారని ఆయన నాయకత్వంలో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోదిరె స్వామి, టౌన్ అధ్యక్షుడు నర్సయ్య,కన్నె సురేందర్,మల్లెల లక్ష్మణ్, అనంతరావ్, విక్రమ్, సాయిబాబా,పల్లె శేఖర్, కోరాడి లింబాద్రి, పొల్సాని రంజిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు