ములుగు జిల్లా:డిసెంబర్ 17
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోకి ప్రవేశించిన పెద్దపులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవు ల్లోకి ప్రవేశించింది. పెద్ద పులి ములుగు తాడ్వా యిలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రెండు రోజుల క్రితం భద్రాద్రి జిల్లా వైపు వెళ్లి మళ్లీ ములుగు జిల్లా అడవుల్లోకి పెద్దపులి సంచలరిస్తుందని అధికారులు తెలిపారు. పెద్ద పులి గమనాన్ని ఎప్పటి కప్పుడు అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు.
పెద్దపులి వల్ల ఎవరికి ఎటువంటి ఆపద రాకూ డదని, గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు. ఈ పెద్దపులి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి, ఇటు ములుగు జిల్లాలోకి తిరుగు తున్న పరిస్థితి ఉందని తెలిపారు.
గత మూడేళ్ల క్రితం కూడాకరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అన్నారు. అప్పట్లో ఒక ఆవుని కూడా పులి చంపి తినేసింది,ఆ తర్వాత నుంచి పులి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయని అన్నారు.
మళ్ళీ తిరిగి పులి ఆన వాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండ లాల్లో గత మూడు రోజుల నుండి పులి కలకలం ప్రజ లను భయాందోళనలకు గురిచేసింది.
గుండాలకు సరిహద్దు అడవులైన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుండి గుండాల ఆళ్లపల్లి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, అడవు ల సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ప్రజల్లో భయాం దోళన నెలకొన్నాయి. పులి ఎప్పుడొచ్చి తమను ఏ ప్రమాదానికి గురి చేస్తుందో నని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 2020 సంవత్సరంలో ఆళ్లపల్లి మండలం మార్కోడు అడవుల్లో పులి సంచరించి ఓ రైతును, ఎద్దును చంపివేసిన విషయం తెలిసిందే.