హైదరాబాద్:డిసెంబర్ 17

లఘు చర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు పట్టడం తో సోమవారం అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది,

 

అదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ లోఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు బేడీలు ధరించి అసెంబ్లీ కి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

 

అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు.

 

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు,సహా ఎమ్మెల్యే లంతా నల్ల చొక్కాలు, చేతులకు బేడీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు.

 

ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీ రాజ్యం లూటీ రాజ్యం.. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు.. అంటూ పలు రకాల నినాదాలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.

 

కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు సభలో లగచర్ల, దిలావర్ పూర్, రామన్న పేట సహా పలు ఘటనలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *