A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

 

నిజామాబాద్ జిల్లా లోని 32 గ్రామాల దేవాంగ కుల పెద్దలచే ఎన్నికల పద్దతిని నిర్వహించి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షునిగా కోటార్మూర్ కు చెందిన శ్రీ గడ్డి ప్రకాష్, ఉపాధ్యక్షులు గా ఆలూర్ దొంద రమేష్, గుత్ప కుంటాల గంగాధర్, ప్రధాన కార్యదర్శి గా ఆర్మూర్ రాస రాము, సంయుక్త కార్యదర్శులు గా రాజారాంనగర్ కొండుక రాజేంధర్, మామిడిపల్లి భూమెని రాజేంధర్, గర్గుపల్లి రాస సురేష్, అమీనాపూర్ గుండెం నవీన్, కోశాధికారులుగా భీంగల్ ఆరె నడిపి సత్యనారాయణ, వేల్పూర్ ఇంద్రపు మహేష్, దస్తూరి రామన్నపేట్ రేగుల్ల గంగాధర్ మరియు జిల్లా సభ్యులుగా అన్ని గ్రామాలలోని సభ్యులతో 64 మందిని ఎన్నుకోవడం జరిగింది.

 

ఇట్టి కార్యక్రమానికి నూతన అధ్యక్షులు గడ్డి ప్రకాష్ సభాధ్యక్షత వహించారు, ఈ కార్యకమానికి దేవాంగ రత్న, మాజీ కలెక్టర్ తొగర్ల చిరంజీవులు, తెలంగాణ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు చోళ రాజేశ్వర్, సంయుక్త కార్యధర్శి బెన్కి నారాయణ, ఆర్మూర్ మాజీ సర్పంచ్ దేవాంగ ముద్దు బిడ్డ కొంగి సదాశివ్ గార్లు మరియు నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల దేవాంగ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలోని దేవాంగులు అభివృద్ధి చెందాలని, ఏమైనా సంఘ సమస్యలు ఉంటె జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీ దృష్టికి తేవాలని తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *