హైదరాబాద్:డిసెంబర్ 11

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యా ర్థులు ఎంతమంది? వారి సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నారా..లేదా? అనే వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. కాగా 2024- 25 విద్యాసంవత్సరంలో 1,899 ప్రభుత్వ పాఠశాల ల్లో జీరో ఎన్ రోల్స్ మెంట్స్ జరిగాయని, ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరలేదని తేలింది.

 

కాగా ఈ జీరో ఎన్ రోల్ మెంట్ జరిగిన స్కూళ్లలో 580 మంది టీచర్లు విధుల్లో ఉన్నారు. కాగా వారిని టీచ ర్ల అవసరమున్న ఆయా స్కూళ్లలో సర్దుబాటు చేశా రు. ఇదిలా ఉండగా కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే చేరిన పాఠశాలల సంఖ్య 53 ఉండగా టీచర్లు 51 మంది ఉన్నారు.

 

ఇలా ఈ విద్యాసంవత్సరం లో పది మంది లోపు విద్యా ర్థులు చేరిన పాఠశాలలు మొత్తం 4324 స్కూళ్లు ఉన్నాయి. అందులో మొత్తం 3326 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

 

తెలంగాణలో మొత్తం 26, 101 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం టీచర్లు 1,06,641 మంది ఉన్నారు. అందులో ప్రైమరీ స్కూళ్లు మొత్తం 18,254 ఉండగా టీచర్లు 40,591 మంది ఉన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 3,142 ఉండగా 13,871 మంది టీచర్లు ఉన్నారు.

 

అలాగే హైస్కూళ్ల సంఖ్య 4,705 ఉండగా టీచర్లు 52,179 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా యి. ప్రతి స్కూల్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు.

 

అయితే ఈ విద్యాసంవ త్సరంలో జీరో ఎన్ రోల్ మెంట్ అయిన 1899 స్కూళ్లలో ప్రైమరీతో పాటు అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లు సైతం ఉండటం గమనార్హం. జీరో ఎన్ రోల్ మెంట్ ఉన్న ప్రైమరీ స్కూళ్ల సంఖ్య 1818 గా ఉంది.అందులో టీచ ర్లు 517 మంది ఉన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 48 ఉండగా టీచర్లు 33 మంది, హైస్కూళ్లు 33 ఉండగా టీచర్ల సంఖ్య 30 గా ఉంది.

 

*పెరుగుతున్న జీరో ఎన్‌రోల్‌మెంట్స్*

 

ఇదిలాఉండగా ఒక విద్యార్థి నుంచి పది మంది విద్యార్థుల వరకు ఉన్న స్కూళ్లు మొత్తం 2415 ఉండగా అందులో 2746 మంది టీచర్లు పనిచేస్తు న్నారు. ఇందులో ప్రైమరీ స్కూళ్లు 2,312, యూపీ ఎస్ లు 94, హైస్కూళ్ల సంఖ్య 9 గా ఉంది…

 

అలాగే 11 నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లు మొత్తం 4,110 కాగా.. టీచర్లు 7282 మంది ఉన్నారు. 21 నుంచి 30 లోపు విద్యార్థులు ఎన్ రోల్ అయిన స్కూళ్లు 3307 ఉండగా టీచర్లు 7213 మంది ఉన్నారు. 31 నుంచి 40 మంది విద్యార్థులు ఎన్ రోల్ అయిన స్కూళ్లు 2580 కాగా టీచర్లు 7252 మంది ఉన్నారు. 41 నుంచి 50 లోపు విద్యార్థులు ఎన్ రోల్ అయిన పాఠశాలల సంఖ్య 1827 కాగా 6545 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

 

50 మందికి పైగా విద్యార్థు లు ఉన్న స్కూళ్లు 9,963 కాగా.. 75,023 మంది టీచర్లు పనిచేస్తున్నారు. హైస్కూళ్లలో తక్కువ మంది పిల్లలున్నా.. విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం కలగొద్దని టీచర్లను అదేస్థాయిలో కొనసాగిస్తున్నారు.

 

రానురాను ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్ రోల్ మెంట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు దీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిం చి తాము ఏమాత్రం తక్కు వ కాదని నిరూపించాల్సిన బాధ్యత సర్కార్ పైనే ఉంది. దీనికోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడు తుందో చూడాలి..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *