మాసాయిపేట ( మెదక్) డిసెంబర్ 10:
రాష్ట్ర అవతరణ తరువాత కొత్త గా ఏర్పడిన మాసాయిపేట మండలం అన్ని రంగాల్లో రాణించాలని నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు.
స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో సి ఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథి గా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించిన ఆవుల రాజీ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు తట్టుకొని సాధించుకున్న మాసాయిపేట మండలం జిల్లా లో అన్ని మండలాల తో పోటీ పడుతూ అభివృద్ధి పధం లో సాగాలని అన్నారు. గ్రామ స్థాయి లో ఉన్న ఉత్తమ క్రీడాకారులను వెలికి తీయాలని మన ముఖ్య మంత్రి క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ఈ నెల 10 నుండి 12 వరకు జరిగే మండల స్థాయి క్రీడలలో మండలం లోని అన్ని గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొని క్రీడలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి రాకేష్ కుమార్, మండల అభివృద్ధి అధికారి ఉమా దేవి, మండల తహసీల్దార్ జ్ఞాన జ్యోతి, మండల విద్యాధికారి లీలావతి, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మ పురి, వివిధ గ్రామాల నుండి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు, ఉపాద్యాయులు, వ్యాయామ ఉపాద్యాయులు, శ్యాం సుందర్ శర్మ, నవీన్, కృష్ణ, కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, శ్రీకాంత నాగి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధిరాములు గౌడ్, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.