తూప్రాన్ డిసెంబర్ 10
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని ఆర్ డి ఓ జయ చంద్రారెడ్డి , మనోహరబాద్ మండలం, జీడిపల్లి గ్రామంలో జరుగుతున్న ,ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ వినియోగంలో ఏమన్న సాంకేతిక ఇబ్బoదులు వున్నాయా అని విచారణ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో తగు సర్వే నిర్వహించి, కచ్చితమైన సమాచారం పొందు పర్చాలని సిబ్బందికి సూచించడం జరిగింది. ఇట్టి పర్యవేక్షణలో ఆర్డీవో వెంట , ఎంపీడీవో, మనోహరాబాద్ ఎంపీ ఓ, గ్రామ పంచాయతీ సెక్రేటరీ తదితరులు పాల్గొన్నారు.