A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండలి విపక్ష నేత మధుసూదనా చారి, కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

శాసనసభ, మండలి సమావేశాల కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు రేపటి నుంచి శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడానికి శాసనసభా పక్షం సమావే శం జరిగింది..

ఉభయ సభల్లో లేవనెత్తా ల్సిన అంశాలు, అనుసరిం చాల్సిన కార్యాచరణ సహా ప్రభుత్వ వైఖరి పై ప్రధా నంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సంద ర్భంగా ఉభయ సభల్లో ఏ అంశాలపై ప్రశ్నించాలి..? ఏ అంశాలపై ఎండగట్టాలనే అంశంపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు..

తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదొక్క మూర్ఖత్వపు చర్యఅన్నారు. ప్రభుత్వాలు చేయవలసిన పనులు ఇవేనా..? అని ప్రశ్నించారు…

ప్రభుత్వాలు మారినప్పు డల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా..? అని ప్రశ్నించారు. తెలం గాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరిం చాలే తప్ప విగ్రహాల రూపా న్ని మార్చ మార్చవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *