A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 05
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రంగం సిద్ధ మైంది. పరస్పర బదిలీల కోసం అర్జీలు పెట్టుకున్న ఉపాధ్యాయుల దరఖా స్తులను పరిశీలించి, వారి నుంచి వ్యక్తిగత పూచీ తీసుకొని, తదుపరి బదిలీ ఉత్తర్వులు విడుదల చేయడానికి అనుగుణంగా వివరాలు పంపించాలని పాఠశాల విద్య డైరెక్టర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
దీనిప్రకారం పరస్పర బదిలీలకు అంగీకారం తెలుపుతున్నట్లు ఇద్దరు ఉపాధ్యాయులు తమ పేరు, ఐడీ నంబరు, మొబైల్ నంబరు, హెచ్‌వోడీ వివరాలతో పాటు ప్రస్తుత స్థానిక క్యాడర్, దరఖాస్తు వెళ్లాలనుకున్నకొత్త క్యాడర్ వివరాలు పొందుపరిచి, ఇద్దరు ఒకే పత్రంపై సంత కాలు చేసి, అండర్‌టేకింగ్ సర్టిఫికెట్‌ను సమర్పించా ల్సి ఉంటుంది. జిల్లా విద్యా శాఖాధికారులు ఆయా ఉపాధ్యాయుల దరఖా స్తులను పరిశీలించి, సమగ్ర వివరాలను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది,
ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయం 317 జీవతో ప్రభావితమై వివిధ కేటగిరీల కింద దరఖాస్తులు చేసుకున్న వారికి తప్ప కుండా బదిలీ ఇవ్వాలి, ప్రధానంగా స్థానికత కూలిపోయిన వారికి ఖాళీలు లేకపోతే సూపర్ న్యూ మరరీ బై పోస్టుల్లో బదిలీకి అవకాశం కల్పిం చాలి, అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేయాలి….
బదిలీల ప్రక్రియను ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని విజయవంతంగా నిర్వహించాలి. గతంలో మ్యాచువల్ బదిలీకి రూ” 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్న వారు ఉన్నారు. ఇది పరోక్షంగా అవినీతికి తావిస్తుంది, ప్రస్తుత జీవోల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేయకూడదని ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నాయి…